తెలిసి చేశారో.. తెలియక చేస్తున్నారో.. తెలియదు కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం రాజకీయ కెరీర్ ఆరంభంనుంచి వ్యూహాత్మక తప్పిదాలు చేస్తూనే ఉన్నారు.. తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు! “చూడప్పా సిద్ధప్పా… బాబుకి నాకూ ఒకటే తేడా.. ఆయన గెడ్డానికి రంగెయ్యరు, నేను వేస్తాను .. అంతే.. హ .. హా…!” అన్నట్లుగా అయిపోతుంది పరిస్థితి అని అంటున్నారు విశ్లేషకులు!
తన లక్ష్యం జనానికి సేవచేయడం కాదు.. ఆ సేవ జగన్ చేయకుండా చేయడం అన్నట్లుగా కెరీర్ ప్రారంభించిన పవన్… టీడీపీ అనంతరం బీజేపీతో జతకట్టారు. ఇప్పుడు ఏపీలో దేవాలయాల్ల్లో విగ్రహాలు ధ్వంసం కావడం వంటి అంశాల నేపథ్యంలో బీజేపీతో జతకట్టి నడవాల్సిన పరిస్థితి పవన్ కు ఏర్పడింది! భాగ్యనగరంలో బాసింపీటేసుకుని కూర్చుని ట్విట్టర్ లో ట్వీటటం కాదు బీజేపీ పవన్ నుంచి ఆశించింది. సో… పవన్ నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి! దీంతో ఇరకాటంలో పడిపోతున్నారంట పవన్!
పూర్తిగా హిందుత్వాన్ని అడ్డుపెట్టుకునో, నమ్ముకునో రాజకీయాలు చేసే బీజేపీతో కలిసి రోడ్డెక్కితే రేపు కొన్ని మతాల వారికి దూరమవుతానేమోననే భయం, ఆందోళన పవన్ లో మొదలైందని అంటున్నారు జనసైనికులు. అలా అని బీజేపీతో కలిసి నడవకుండా ఉంటే… పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. కలిసి నడిస్తే నోటా తో పోటీ పడాల్సిన పరిస్థితి!! సరే బీజేపీతో తూచ్ అనేసి.. మళ్లీ సైకిల్ ఎక్కేద్దాం అంటే.. జనం ఛీ అంటారనే భయం! దీంతో… పవన్ కష్టం పగోడికి కూడా రావొద్దని అంటున్నారు జనసైనికులు!! మరి పవన్ వీటినుంచి ఎలా బయటపడతారో వేచి చూడాలి!!
-CH Raja