“జవాన్” కోసం షారుఖ్ ఖాన్ కు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్

-

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా మరియు తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్ర “జవాన్”. నిన్న థియేటర్ లలోకి ఎంతో గ్రాండ్ గా విడుదల కాగా.. విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్ లు దిమ్మతిరిగిపోతున్నాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం నిన్న ఒక్క రోజే 120 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో నటించిన షారుఖ్, విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకునే అందరూ ప్రాణం పెట్టి నటించి సినిమాను ఇంత సక్సెస్ చేశారు. అన్ని ఇండస్ట్రీ లు ఈ సినిమాను మెచ్చుకుంటున్నాయి.. ఇక తాజాగా ఈ సినిమా గురించిన ఒక టాక్ వినిపిస్తోంది, ఈ సినిమాలో నటించడానికి షారుఖ్ ఖాన్ 100 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడట. ఇది కేవలం ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మాట మాత్రమే..

కానీ వాస్తవంగా ఎంత పారితోషికాన్ని తీసుకున్నాడు అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ సినిమాకు జైలర్ సినిమాకు మించి కలెక్షన్ లు వచ్చే అవకాశం ఉందని మేకర్స్ మాట్లాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version