ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ.. చాలా విభిన్నంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పోల్చితే… ఏపీ రాజకీయాలు చాలా డిఫరెంట్. అయితే.. అనంతపురం జిల్లాలో అయితే.. ఒకే పార్టీ కీ చెందిన జేసీ కుటుంబానికి, పరిటాల కుటుంబానికి అస్సలు పడదు. వారి కుటుంబాల మధ్య పచ్చ గడి వేస్తే.. భగ్గుమంటుంది.
జేసీ కుటుంబం గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య తగదాలు ఉండేవి. 2014 అనంతరం జేసీ కుటుంబం కూడా టీడీపీ లో చేరడంతో ఈ రెండు వర్గాల మధ్య క్రమంగా దూరం తగ్గుతూ వచ్చిందని టాక్. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఇవాళ నారా లోకేష్ అనంతరం పురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఇద్దరూ కలుసుకుని.. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అంతేకాదు.. మంచి మిత్రుల లాగా…. కలిసి మెలిసి మెలిగారు. అయితే.. వీరిద్దరూ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన తెలుగు దేశం తమ్ముళ్లు ఫుల్ హ్యాపీ అవుతున్నారు.