ఆసక్తిరేపుతున్న జేడీ చక్రవర్తి ‘దయ’ గ్లింప్స్‌

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జేడీ చక్రవర్తి. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమాతో టాలీవుడ్ కి నటుడుగా ఎంట్రీ ఇచ్చిన జెడి చక్రవర్తి కెరీర్ ఆరంభంలో విలన్ గా నటించారు. ఆ తరువాత.. గులాబీ, బొంబాయి ప్రియుడు, సత్య, మనీ మనీ, అనగనగా ఒక రోజు, ఎగిరే పావురమా, దెయ్యం, వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఆయన.. కొన్ని చిత్రాలకు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఇక చివరగా రెండేళ్ల క్రితం ‘ఎం ఎం ఓ ఎఫ్’ అనే సినిమాలో లీడ్ రోల్ లో కనిపించిన జేడి.. చాలా గ్యాప్ తర్వాత ‘దయ’ అనే సరికొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Dayaa: ఆసక్తి కలిగించేలా జేడీ చక్రవర్తి 'దయ'.. గ్లింప్స్‌ | jd chakravarthy  dayaa web series glimpse

సాదినేని అనే యంగ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ లో ఈషా రెబ్బ హీరోయిన్ కాగా, కమల్ కామరాజు, రమ్య నంబేసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. 30 సెకన్ల నిడివి గల ఈ వీడియో చూడటానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ముఖ్యంగా ఇందులో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది. ఇక ఈ వీడియో చివరిలో జేడీ చక్రవర్తి సీరియస్ లుక్ తో కనిపించాడు. మొత్తానికి ఈ సిరీస్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. రిలీజ్ డేట్ త్వరలో రివీల్ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news