నేను బ్రాహ్మిణ్  ను .. చచ్చినా ఆ తప్పు చేయనంటున్న అనసూయ..!!

-

అనసూయ అటు బుల్లితెరపై గ్లామర్  యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా వెండితెరపై కూడా గ్లామర్ డాల్ గా నిరూపించుకుంది. పలు సినిమాలలో కీలక పాత్రలు పోషించడమే కాకుండా ఐటమ్ సాంగులలో కూడా మెరిసింది. మరో పక్క లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో యంగ్ హీరోయిన్లకు చమటలు పట్టించిందని చెప్పవచ్చు. ఇకపోతే విలన్ పాత్రలతో కూడా మెప్పించింది అనసూయ. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన ఈమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను జబర్దస్త్ వదిలేసి వస్తున్నానంటే భయం వేసింది అని , బాధగా అనిపించిందని,  ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో అదే అనుభూతి తనకు ఎదురైంది అంటూ ఆమె వెల్లడించింది.
ఇక తాను కేవలం ఏదో ఒకదానికి మాత్రమే పరిమితం కాదు అని.. టీవీ షోలు,  సినిమాలు రెండూ కూడా ముఖ్యమని తెలిపింది. ఇకపోతే గతంలో లాగా టీవీ ఇండస్ట్రీ స్వచ్ఛతగా లేదు.. ఇప్పుడు కలుషితం అయిపోయింది.. దీనివల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఏవైతే ఉంటాయని భయపడ్డానో అవి లేవు .. మనం తీసుకునే ఛాయిస్ ని బట్టి ఉంటుందని అనసూయ తెలిపింది.మంచి , చెడు ప్రతిచోట ఉన్నాయి. మనం ఎంచుకునే దారిని బట్టి మన ప్రవర్తన ఉంటుంది అంటూ తెలిపింది.
తాను ఎంచుకున్న దారి తనకు కంఫర్ట్ ఇచ్చిందని.. ఏదో ఆఫీస్ కి వెళ్లి వస్తున్నట్టు ఉండేదని ఆమె తెలిపింది..కానీ కొన్నిసార్లు ఇబ్బందులు పడినా.. నచ్చకపోయినా.. కొనసాగాను అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తినని.. భయపడుతూనే టీవీ ఇండస్ట్రీకి వచ్చానని ..ఫీల్డ్ లోకి అడుగుపెడుతున్నావంటే ..మేకప్ వేసుకుంటావా? కెమెరాను ఫేస్ చేస్తావా ? అనేవారు అని,  ధైర్యం చేసి ఈ ఫీల్డ్ లోకి వచ్చానని ఆమె చెప్పుకొచ్చింది. ఇకపోతే తనకు ఆత్మగౌరవం ఎక్కువ అని,  అది దెబ్బ తినేలా ఉంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండనని ఆమె తెలిపింది. అంతేకాదు తన క్యారెక్టర్ ను బ్యాడ్ చేసే ఏ ఒక్క సందర్భం వచ్చినా  సరే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతానని.. చచ్చినా కూడా అలాంటి  తప్పుడు పనులు చేయనని చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను ఎంబీఏ చేసి హెచ్ఆర్ గా పనిచేశాను.. సినీ ఫీల్డ్ కాకపోతే ఉద్యోగం చేసుకుంటూ బ్రతుక్కుంటాను అని కూడా చెప్పింది అనసూయ.

Read more RELATED
Recommended to you

Exit mobile version