కౌశిక్ రెడ్డి వల్లే టిఆర్ఎస్ ఓటమి : జీవన్ రెడ్డి

హుజూరాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితలపై జగిత్యాల మాజీ ఎమ్యెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఓటు వెయ్యం అని జనం డైరెక్ట్ గా చెప్పారని ఆయన తెలిపారు. సిఎం కేసీఆర్ వ్యతిరేక ఓటు బ్యాంకు అంతా ఈటల రాజేందర్ కు పడిందని.. కౌశిక్ రెడ్డి తోనే టిఆర్ఎస్ పార్టీ ఓడి పోయిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

ఇది కేసీఆర్ స్వయం కృతాపరాదమనీ ఎద్దేవా చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తే 30, 40 వేల ఓట్లు వచ్చేవన్నారు. కౌశిక్ రెడ్డి పోటీ చేయడం కారణంగా ఈటల రాజేందర్ కు ఓట్లు తగ్గి కేసీఆర్ గెలిచేవారని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి చేరితే.. 60 వేల ఓట్లు టీఆరెస్ కు వస్తాయని కేసీఆర్ అనుకున్నారని ..కానీ ఆ ప్లాన్ బెడిసి కొట్టిందని చురకలు అంటించారు జీవన్ రెడ్డి. ఇప్పటికైనా సిఎం కెసిఆర్ బుద్ది తెచ్చుకోవాలన్నారు. కాగా హుజూరాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.