నరేష్ పై జీవిత సంచలన వ్యాఖ్యలు.. లేడీని టార్గెట్ చెయ్యటం సిగ్గుగా లేదా ?

-

మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా… ప్రకాశ్ రాజ్ చానల్ సభ్యురాలు.. ప్రముఖ నటి జీవిత… నటుడు నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మా డైరీ లాంచ్ నుంచి నటుడు నరేష్ తో విభేదాలు వచ్చాయని జీవిత రాజశేఖర్ చెప్పారు. నరేష్ మోసాలు చేశాడని తాను అనను కానీ విభేదాలు మాత్రం అతడితో వచ్చాయని పేర్కొన్నారు.

ఒకసారి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టాలని ఎంత కోరినా నరేష్ అసలు వినలేదని మండిపడ్డారు జీవిత. జనరల్ బాడీ మీటింగ్ పెడితే తనను దింపే స్తారని నరేష్ అపోహ పడ్డారని చురకలంటించారు. బేదాభిప్రాయాలు ఉన్నప్పుడు డైరీ లాంచ్ గ్రాండ్ గా చేయొద్దని కోరినా నరేష్ వినలేదని తెలిపారు. బండ్ల గణేష్ తనపై ఆరోపణలు చేశారు కాబట్టే ఆయన గురించి మాట్లాడాను అని పేర్కొన్నారు జీవిత.

పృథ్వీరాజ్ కూడా తనపై ఆరోపణలు చేశారని… పృథ్వి చేసిన ఆరోపణలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఒక లేడీని టార్గెట్ చెయ్యటం సిగ్గుగా లేదా ? అని ఫైర్ అయ్యారు. నరేష్… అందరినీ కలుపుకొని ఫోన్ అందుకే ఇప్పుడు ఈ ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. ఈసీ మీటింగ్స్ లో కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నారు జీవిత. డైరీ లాంచ్ లో రాజశేఖర్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఆరోజు రాజశేఖర్ చేసింది తప్పు అన్నట్టుగా చేశారని మండిపడ్డారు. మంచి చేద్దామని ప్రయత్నించి తాను, రాజశేఖర్ పిచ్చోళ్లను అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు జీవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version