ఏపీ వాసులకు శుభవార్త. రిలయన్స్ జియో తన ట్రూ 5జి సేవలను ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో సోమవారం లాంచరంగా ప్రారంభించింది. ఇప్పటికే తిరుమల, విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు పట్టణాల్లో రిలయన్స్ జియో తన ట్రూ 5జి సేవలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో నెట్వర్క్ కోసం జియో ఇప్పటికే రూ. 26,000 కోట్లతో పాటు ఆదనంగా 5జి నెట్వర్క్ ను ఏర్పాటు చేయడానికి మరో రూ. 6,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జి సేవలు అందుబాటులోకి వస్తాయి.
జియో ట్రూ 5జీ సేవల ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ టెలి కమ్యూనికేషన్ నెట్వర్క్ పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి, ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది.