జీవితా ప్రొడ్యూసర్లను ట్రాప్ చేస్తోంది…. గరుడ వేగ నిర్మాత కోటేశ్వర్ రావు

-

జీవిత రాజశేఖర్ మాపై అసత్య ఆరోపణలు చేసింది… మీ ఇంట్లో దొరికిన దృశ్యాలకు మాకు ఏం సంబంధం అని ప్రశ్నించారు గరుడ వేగ నిర్మాత కోటేశ్వర్ రావు. జీవిత ప్రొడ్యూసర్లను ట్రాప్ చేస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. మేం లండన్ నుంచి వచ్చామని… జీవిత ట్రాప్ లో పడమని.. ఆవలిస్తే పేలుగు లెక్కిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. జీవిత తన మామను తీసుకువచ్చి నా భార్య హేమ కాళ్లు పట్టుకని కోట్ల రూపాయాలు అప్పుతీసుకుందని ఆరోపించారు. రాజశేఖర్ కు డబ్బు అవసరం లేదని… జీవితకు అవసరం అంటూ విమర్శించాడు. జీవిత తన కూతుళ్లను అడ్డుపెట్టుకుని ఇప్పుడు డబ్బు గుంజే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. జీవిత గతంలో చాలాసార్లు మోసం చేసిందని రాజశేఖర్ తండ్రి వరద రాజన్ మా దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డారని కోటేశ్వర్ రావు అన్నాడు. జీవిత చిలకపలుకులు మీడియాతో కాదు కోర్ట్ లో పలకాలని అన్నాడు. రాజశేఖర్ డబ్బులు తీసుకున్న రోజు మేము దేవుళ్లుగా కనిపించాం… ఇప్పడు కనిపించలేదా.? అని ప్రశ్నించారు. జీవితకు కోర్ట్ సమన్లు వెళ్లాయనడానికి మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. డాక్యుమెంట్లు పోయాయని 420 వేశాలు వేసింది జీవిత అంటూ విమర్శించాడు. కోటేశ్వర్ రావును ఇరికించడం జీవిత తరం కానది హెచ్చరించాడు. రాజశేఖర్ కోసం తన తమ్ముడి దగ్గర జీవిత డ్రగ్స్ తెప్పించిందని..రాజశేఖర్ తో సినిమాలు తీసేవాళ్లు లేరని.. సినిమా విడుదలైతే చూసే వాళ్లు కూడా ఎవరూ లేరని కోటేశ్వర్ రావు విమర్శించాడు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news