AIIMS రాయ్బరేలీలో ఉద్యోగాలు… పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. రాయ్ బరేలీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే…

ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ | Aeronautical Development Agency
ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ | Aeronautical Development Agency

రాయ్ బరేలీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఫ్యాకల్టీ పోస్టులు వున్నాయి. మొత్తం వంద ఖాళీలు వున్నాయి. ఇక పోస్టుల వివరాలను చూస్తే.. ప్రొఫెసర్ పోస్టులు 28, అదనపు ప్రొఫెసర్ 22 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 18 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 32 పోస్టులు వున్నాయి. అధికారిక సైట్ recruitment.aiimsrbl.edu.in ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఇక వయస్సు విషయానికి వస్తే.. అసోసియేట్ ప్రొఫెసర్/ప్రొఫెసర్ పోస్టులకి 58 ఏళ్లు దాటి వుండకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి అయితే 50 ఏళ్లు మించకూడదు. అలానే దరఖాస్తు ఫీజు రూ.2,000 గా వుంది. అదే ఎస్సీ/ఎస్టీ ఎస్సీ, ఎస్టీ వారికైతే రూ.1000 దరఖాస్తు ఫీజు. కావాలంటే ఒకటి ఎక్కువ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. అదే విధంగా అనాటమీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ లో పోస్టుల భర్తీకి నాన్ మెడికల్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. aiimsrbl ద్వారా పూర్తి వివరాలను చూడచ్చు. అప్లై చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news