నిషా సంస్థలో 797 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతోనే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర నిఘా విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చెయయచ్చు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వున్నఇంటెలిజెన్స్ బ్యూరో లో మొత్తం 797 పోస్టులు వున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (జేఐవో) గ్రేడ్‌-2/ టెక్నికల్‌ పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అర్హత వివరాలు చూస్తే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యా సంస్థ నుంచి పోస్టును బట్టి డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌ ని కానీ బ్యాచిలర్‌ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఫిజిక్స్/ మేథమెటిక్స్‌) ని కానీ లేదు అంటే బీసీఏ లేదా తత్సమాన కోర్సు ని పూర్తి చేసి ఉండాలి.

jobs
jobs

ఈ అర్హతలు కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వయస్సు విషయానికి వస్తే… వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు/ ఓబీసీలకు మూడేళ్ల పాటు సడలింపు వుంది. జూన్‌ 23, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానం లో ఈ పోస్టుల కి దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500లు అప్లికేషన్‌ ఫీజును చెల్లించాల్సి వుంది. జూన్‌ 27వ తేదీలోపు ఫీజు కట్టాలి.

100 మార్కులకు రాత పరీక్ష, 30 మార్కులకు స్కిల్ టెస్ట్, 20 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటాయి. అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎమినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతం ఇస్తారు. పూర్తి వివరాలని https://www.mha.gov.in/en లో చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news