బీటెక్ చేసిన వారికి గుడ్ న్యూస్.. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కి చెందిన రాజస్థాన్‌ రిఫైనరీ లిమిటెడ్‌ లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కి చెందిన రాజస్థాన్‌ రిఫైనరీ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేస్తోంది. దీనిలో మొత్తం 46 ఖాళీలు వున్నాయి. ఇక వయస్సు విషయానికి వస్తే… అభ్యర్ధుల వయసు 42 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక అర్హత వివరాలలోకి వెళితే.. సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, హెచ్‌ఆర్‌, సీఏ, లా, మెకానికల్‌, మెకానికల్‌ – పెట్రోకెమికల్‌ వారు అప్లై చేసుకోవచ్చు.

శాలరీ విషయానికి వస్తే.. మేనేజర్‌ పోస్టులకు సంవత్సరానికి రూ.20.83లక్షలు, సీనియర్‌ మేనేజర్‌ పోస్టుకు సంవత్సరానికి రూ. 23.44 లక్షలు ఇస్తారు. సంబందిత స్పెసలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ డిగ్రీ/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/సివిల్‌/కెమికల్‌ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతే కాదు అనుభవం కూడా ఉండాలి.

ముఖ్యంగా టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం అని నోటిఫికేషన్ లో తెలిపారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 15, 2022. ఎంపిక విధానం గురించి చూస్తే.. అకడమిక్‌ మెరిట్, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను https://www.hrrl.in/ చూసి అప్లై చేసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version