ఇండియన్‌ ఆయిల్‌లో ఉద్యోగాలు… రాత పరీక్ష లేకుండానే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వ రంగ సంస్థ వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలని చూస్తే.. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. దీనిలో మొత్తం 106 ఖాళీలు వున్నాయి. పోస్టుల వివరాలని చూస్తే..

ఎగ్జిక్యూటివ్ లెవెల్‌-1 (96), ఎగ్జిక్యూటివ్ లెవెల్‌-2 (10) లో ఈ ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, బీఈ/ బీటెక్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ని పూర్తి చేసిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు బరౌని, గుజరాత్, హాల్దియా, పానిపట్, దిగ్బోయి, పారాదీప్ లో పని చెయ్యాల్సి వుంది.

అంతే కాక సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే… 28-02-2023 నాటికి ఎగ్జిక్యూటివ్ లెవల్ 1 పోస్టులకు 35 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్ లెవల్ 2 పోస్టులకు 45 ఏళ్లు దాటి వుండకూడదు. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే… దరఖాస్తు ఫీజు కింద రూ. 300 చెల్లించాల్సి వుంది. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసేందుకు 22-03-2023 చివరి తేదీ. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల ని https://iocl.com/latest-job-opening లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news