ఫస్ట్‌ సౌత్‌ స్టార్‌గా అల్లు అర్జున్‌ రికార్డ్‌.. అదుర్స్‌

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. ‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా డబులైంది. ఆ సినిమాలో అల్లు అర్జున్ నటన, మ్యానరిజం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘పుష్ప’ సినిమాతో నార్త్ ఇండియాలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇక అభిమానులైతే ఆయనని కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని పిలుచుకుంటారు. ఈ పేరుకి తగినట్లే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఐకాన్ స్టార్ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగియున్న సౌత్ హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ లో అల్లు అర్జున్‌ ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరింది.

Allu Arjun : సరికొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్జున్.. సౌత్ ఇండియాలోనే  ఫస్ట్ టైం ఆ రికార్డ్ సాధించింది బన్నీనే.. - 10TV Telugu

పుష్ప సినిమా క్రేజ్‌తో బన్నీకి వరల్డ్‌ వైడ్‌గా ఫ్యాన్‌ బేస్‌ పెరిగిపోయింది. నెటిజన్లు, అభిమానులు అందిస్తున్న ప్రేమాభిమానాలతో అల్లు అర్జున్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్ల అరుదైన మైలురాయికి చేరిపోయింది. దక్షిణాది నుంచి ఇలాంటి అరుదైన మార్క్‌ అందుకున్న తొలి నటుడిగా రికార్డుల్లోకెక్కాడు బన్నీ. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప: ది రైజ్’ కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘పుష్ప: ది రూల్’ చిత్రీకరణలో బన్నీ బిజీబిజీగా ఉన్నారు.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్‌ ఫాసిల్‌, సునీల్‌తోపాటు పలువురు పాపులర్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పుష్ప.. ది రైజ్‌కు అదిరిపోయే ఆల్బమ్ అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి మరోసారి సంగీతం అందిస్తున్నాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news