మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదినక పలు విభాగాల పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనిలో మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. ఇక అభ్యర్థుల వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థికి గరిష్ట వయసు 42 ఏళ్లు మించి ఉండకూడదు. అర్హత వివరాల లోకి వెళితే.. పోస్టుని బట్టి పదవ తరగతి, డిప్లొమా, బీఎస్సీ చేసి ఉండాలి.
అలానే కొన్ని పోస్టులకి అయితే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. రేడియోగ్రాఫర్, ఆఫరేషన్ థియేటర్ అసిస్టెటంట్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్, కాథ్‌లాబ్ టెక్నిషియన్, ఈసీజీ టెక్నిషియన్, స్పీచ్ థెరపిస్ట్, ఎంఆర్ఐ టెక్నిషియన్, సీటీ టెక్నిషియన్ మొదలైన పోస్టులు వున్నాయి. డయాలసిస్ టెక్నిషియన్ కచ్చితంగా ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
ఇక దరఖాస్తు విషయానికి వస్తే.. దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. ఎటువంటి పరీక్ష లేకుండా మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఏప్రిల్ 13, 2022 వరకు అవకాశం ఉంది. కనుక ఈ లోగా అప్లై చేసుకుంటే మంచిది.