BREAKING : కరీంనగర్‌ సీపీకి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

-

మూడు నెలల కిందట.. కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ను అరెస్టు చేసిన కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తాజాగా కరీంనగర్ సీపీ సత్యనారాయణతో సహా పోలీసులకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ లో ఎంపీ కార్యాలయంపై దాడి చేసి, అక్రమంగా అరెస్టు చేసి తన హక్కులకు భంగం కలగించారంటూ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీని గతంలో బండి సంజయ్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా నోటీసులు జారీ చేసింది పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ. ఈ నెల 26న మధ్యాహ్నం 1.30 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కరీంనగర్ సీపీ వి.సత్యనారాయణతో పాటు కరీంనగర్ ఎసీపీ(సీసీఎస్) కె.శ్రీనివాస్, హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి, జమ్మికుంట సీఐ కొమ్మనేని రామచంద్రరావు, హుజూరాబాద్ ఇన్ స్పెక్టర్ వి.శ్రీనివాస్, కరీంనగర్ వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ చల్లమల్ల నటేష్ లకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. నోటీసుల ప్రతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.సోమేశ్ కుమార్ కు పంపింది పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news