బీఈ, బీటెక్‌ అర్హతతో ఉద్యోగాలు.. రూ.16 లక్షలు జీతం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ లో కొన్ని ఖాళీలు వున్నాయి. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ పట్నా, సిల్‌చర్‌, గువాహటిల లోని ఈ ఖాళీలు వున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

jobs
jobs

దీనిలో మొత్తం 19 ఖాళీలు వున్నాయి. ప్రిన్సిపల్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అడ్మిన్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, మేనేజర్‌ పోస్టులు, ఎక్సాస్కేల్ కంప్యూటింగ్ మిషన్, మైక్రోప్రాసెసర్ అండ్‌ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ మిషన్, ఏఐ అండ్‌ లాంగ్వేజ్ కంప్యూటింగ్ మిషన్, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇలా కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుండి బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ఎంబీఏ/పీహెచ్‌డీ ని పూర్తి చేసి ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళ వయస్సు 56 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్‌ 27, 2022 చివరి తేదీ. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఏడాదికి రూ.16 లక్షలు సాలరీ కింద ఇస్తారు. పూర్తి వివరాలను https://careers.cdac.in/post-details/M8P8HW లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news