ఒక్క దెబ్బతో ముగ్గురు హీరోయిన్లకు ముచ్చెమటలు పట్టించిన స్టార్ హీరో..

-

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం యాక్షన్ ప్యాక్ డ్ మూవీస్ గురించి సినీ లవర్స్ అందరికీ తెలుసు. ఆయన తన ప్రతీ సినిమాలో యాక్షన్ స్టంట్స్ డిఫరెంట్ గా చేసే ప్రయత్నం చేస్తుంటారు. హాలీవుడ్ రేంజ్ లో మనం కూడా సినిమాలు తీయగలమని కండల వీరుడు జాన్ చెప్తుంటారు కూడా. ప్రస్తుతం ఆయన నటించిన ‘అటాక్’ చిత్ర ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా జాన్ చేసిన ఓ పనికి ముగ్గురు హీరోయిన్లు ఆశ్చర్యపోయారు.

‘అటాక్’ ఫిల్మ్ ప్రమోషన్స్ లో భాగంగా బ్యూటిఫుల్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి హీరో జాన్ అబ్రహం ‘ఇండియాస్ గాట్ టాలెంట్’షోకు వెళ్లారు. అక్కడ ప్రోగ్రాం టెలికాస్ట్ సందర్భంగా జాన్ అబ్రహం చేసిన పనికి హీరోయిన్స్ శిల్పాశెట్టి, రకుల్, జాక్వెలిన్ ఆశ్చర్యపోయారు. ఇన్ స్టా రీల్స్ కోసం చేసిన పనిగా ఇది అని అంటూ శిల్పాశెట్టి తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ వీడియో షేర్ చేయగా, అది నెట్టింట వైరలవుతోంది.

జాన్ అబ్రహం తన ఎడమ చేతి మణికట్టుపై కుడిచేతితో ఒకే ఒక్క దెబ్బ కొట్టుకున్నాడు. అంతే.. నరాలు ఉప్పొంగిపోయాయి. అది చూసి ఆశ్చర్యపోయి వావ్ అనేశారు హీరోయిన్స్. ‘సూపర్ సోల్జర్’ అంటే ఈయనే అని అన్నారు. ఈ వీడియో చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు.

ఈ వీడియోకు బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత లైక్ కొట్టగా, నెటిజన్లు సంబురపడిపోతున్నారు. ‘అటాక్’ చిత్ర కథ ఫిక్షనల్ కాగా, ఈ స్టోరిని జాన్ అబ్రహం అందించడం గమనార్హం. ఆర్మీ సూపర్ సోల్జర్ కాన్సెప్ట్ నేపథ్యంలో కథ ఉండబోతున్నదని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రం ఉగాది కానుకగా ఏప్రిల్ 1న విడుదలైంది.
.

https://www.instagram.com/reel/CbzEFdwjMlz/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news