మీ ప్రేమ, అభిమానం నన్ను ముందుకు నడిపిస్తున్నాయి… జూనియర్ ఎన్టీఆర్ ట్విట్

-

దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన మూవీ ‘ ఆర్ఆర్ఆర్’. ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి బ్లాక్ బస్టర్ తరువాత డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో అందరిలోను అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు రామ్ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ నటిస్తుండటంతో ఈ సినిమాపై హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు పోటాపోటీగా నటించారని.. రాజమౌళి స్క్రీన్ ప్లే, డైరెక్టన్ సూపర్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఇదిలా తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమాకు వస్తున్న అపూర్వ స్పందనపై హీరో ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ట్విట్టర్ లో అందరికి ధన్యవాదాలు తెలిపారు. ‘ నాపై చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి ధన్యావాదాలు. మీ ప్రేమ, అభిమానం, మద్దతు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్ ఉన్న ట్రిపుల్ ఆర్ సినిమాను ఎంజాయ్ చేయండి’ అంటూ ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news