రామ్ చరణ్ చేసిన పనికి కన్నీటి పర్యంతమవుతున్న జూనియర్ ఎన్టీఆర్.. కారణం..?

-

రామ్ చరణ్ , ఎన్టీఆర్ మద్య స్నేహబంధం ఎంతలా ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ క్రమంలోనే ఆయన తన స్నేహాన్ని మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన ఆరవ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ పురస్కారాలలో ఏకంగా ఐదు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది ఆర్ఆర్ఆర్. అది కాక బెస్ట్ యాక్షన్ మూవీలో బెస్ట్ యాక్టర్స్ గా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులో నామినేట్ అయ్యారు రాంచరణ్ , జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా యంగ్ టైగర్ పై ఉన్న తన ప్రేమను మరొకసారి నిరూపించుకున్నాడు రామ్ చరణ్. దీంతో రామ్ చరణ్ సంస్కారానికి ఎన్టీఆర్ , నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఆర్ ఆర్ ఆర్.. ఇప్పటికీ ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది . తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాల్లో కూడా ఐదు అవార్డులను సాధించి మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించింది. ఇకపోతే బెస్ట్ యాక్షన్ మూవీ , బెస్ట్ యాక్టర్స్ గా నామినేట్ అవ్వడమే కాదు ఇప్పుడు మరో అవార్డు రావడం ఖాయమని తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ పై తనకున్న ప్రేమను మరోసారి చాటుతూ.. ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్ ఇలా పంచుకున్నారు..

” బెస్ట్ యాక్షన్ మూవీలో బెస్ట్ యాక్టర్స్ గా నా అన్న ఎన్టీఆర్ పేరుతో పాటుగా నా పేరును చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదే కాక మా పేర్లు హాలీవుడ్ దిగ్గజాలైన నికోలస్ కేజ్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ లతో కలిసి ఉండడం గొప్ప సంతోషాన్నిస్తోంది” అంటూ రాంచరణ్ చెప్పుకొచ్చారు. ఒక్క ట్వీట్తో రామ్ చరణ్ మరొకసారి తన సంస్కారాన్ని నిరూపించుకున్నాడు అని చెప్పవచ్చు. ఇకపోతే రామ్ చరణ్ తనపై చూపిస్తున్న ప్రేమకు ఎన్టీఆర్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా రాంచరణ్ , ఎన్టీఆర్ ల మధ్య స్నేహం మరింత బలపడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news