ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఈ ఆహారపదార్ధాలు తీసుకుంటే మంచిది..!

-

ఊపిరితిత్తులు ( Lungs ) ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఆహారపదార్థాలు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి. వీటిని తీసుకోవడం వలన ఊపిరితిత్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది. అయితే సాధారణంగా గాలి కాలుష్యం, స్మోకింగ్, హానికరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

 

lungs | ఊపిరితిత్తులు
lungs | ఊపిరితిత్తులు

ఊపిరితిత్తులు ఏమైనా సమస్య కలిగితే ఆస్తమా, పల్మనరీ డిసీజెస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. మరి వాటి కోసం ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేద్దాం.

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి ఆహార పదార్థాలు:

ఆపిల్:

ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఆపిల్ చాలా బాగా సహాయపడుతుంది. ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లవనోయిడ్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆస్తమా, లంగ్ క్యాన్సర్ వంటి సమస్యలను తొలగిస్తుంది.

గుమ్మడి కాయ:

గుమ్మడి కాయ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడికాయలో బీటా కెరోటిన్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇది ఇంఫ్లేమేషన్ ని తొలగిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా దీన్ని కూడా తీసుకోండి.

పసుపు:

పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపులో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. రెగ్యులర్ గా వంటల్లో పసుపు వాడడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ లో ఈసీసీజీ ఎలిమెంట్ ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఇది చూసుకుంటుంది. కాబట్టి రెగ్యులర్ గా వీటిని మీరు మీ డైట్ లో తీసుకోవడం మంచిది. ఇలా మీ డైట్ లో ఈ ఆహార పదార్ధాలు తీసుకుంటే ఆరోగ్యంగా, ఊపిరితిత్తుల సమస్య లేకుండా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news