ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. గులాబీలు గుత్తులుగా పూస్తాయి..!

-

చాలా మంది ఇళ్లల్లో పూల మొక్కలని నాటుతారు. పూలను బాగా పెంచడం అంటే చాలామందికి ఇష్టం. ఎక్కువగా గులాబీ పూలను చాలామంది పెంచాలని చూస్తూ ఉంటారు. అయితే గులాబీ పూలు గుత్తులు, గుత్తులుగా పూయాలంటే ఈ ఇంటి చిట్కాలు ని పాటించండి ఇలా కనుక మీరు చేశారంటే గులాబీ పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలు అన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయి.

 

పువ్వులు బాగా పూయాలంటే పూల కుండీ లో కలుపు లేకుండా తీసేయాలి. కూరగాయల వ్యర్ధాలుని నానబెట్టి.. ఆ నీటిని మొక్కలకి ఎరువులుగా పోస్తూ ఉండాలి గులాబీ మొక్క కొత్తగా చిగురించాలంటే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేయాలి. ఎండిన కొమ్మలు ఆకులు వాడిపోయిన పూలు వంటివి తొలగిస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా కొమ్మలని చేత్తో విరవకూడదు.

కత్తెరతో వారానికి ఒకసారి కత్తిరిస్తూ ఉండాలి. ఒక ఇయర్ బడ్ ని తీసుకుని మొక్క కొమ్మ కట్ చేసిన తర్వాత చివర్లో ఇయర్ బడ్ ని పసుపు ముంచేసి దాన్ని గులాబీ మొక్కని కత్తిరించిన చోట్ల అద్దండి ఇలా చేయడం వలన కొమ్మ వాడిపోకుండా ఉంటుంది చిగురుస్తుంది. ఈ మొక్క తాలూకా కొమ్మని కత్తిరించిన తర్వాత దానికి పోషకాలు అవసరం క్రమ పద్ధతిలో ఎరువుని కూడా స్ప్రే చేయండి. ఇలా మీరు ఈ చిట్కాలను పాటిస్తే మీ ఇంట్లో గులాబీ మొక్కకి గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news