“ఆంటీ” అంటున్నారని పోలీసులను ఆశ్రయించిన అనసూయ !

-

అందాలకు C/o అడ్రస్ అనసూయ అని చెప్పవచ్చు.. బుల్లితెరపై పలు షోలు చేయడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ తానేంటో నిరూపించుకుంటుంది. ముఖ్యంగా తన అందంతో ఎదుటివారిని ఆకర్షించే అంత అందాలు ఉన్న ఈ ముద్దుగుమ్మ.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే.. తాజాగా ఈ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకుంది. యాంకర్ అనసూయ..లైగర్‌ సినిమాపై చేసిన ట్వీట్‌ కారణంగా.. నెటిజన్ల దాడికి బలవుతోంది.

ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైం పోలీసులను యాంకర్ అనసూయ భరద్వాజ్..ఆశ్రయించినట్లు సమాచారం అందుతోంది. ట్విట్టర్ లో తనను ఆంటీ అంటూ ఏజ్ షేమింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అనసూయ.. పోలీసులకు ఫిర్యాదు చేశారని టాక్‌. నిన్న విజయ్ దేవరకొండ లైగర్ సినిమా పై ఆమె చేసిన ట్విట్ తో ఈ వివాదం చెలరేగింది.

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వరుస ట్వీట్లతో “ఆంటీ” అనే పదం ట్విట్టర్ లో టెండింగ్ గా మారింది. తన ఏజ్ ను ప్రస్తావిస్తూ , ఆంటీ అని కామెంట్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ అనసూయ ట్విట్ చేసింది. దాంతో మరింత రెచ్చిపోయిన.. నెటిజన్లు.. ఆమెను దారుణంగా ట్రోల్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… పోలీసులకు ఫిర్యాదు చేశారట. దీనిపై వివరాలు రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news