పవన్‌పై కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు

-

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేఏ పాల్ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు దీక్ష కంటిన్యూ చేస్తానని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా వెనకడుగువేసే ప్రసక్తేలేదన్న చెప్పారు. దీక్ష చేస్తున్న పాల్కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను బలవంతంగా హాస్పిటల్కు తరలించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన అనంతరం మీడియాతో మాట్లాడిన పాల్ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

KA Paul Shows His Commitment For Vizag Steel Plant! | KA Paul Shows His  Commitment For Vizag Steel Plant!

ఇది ఇలా ఉంటె, పవన్ కళ్యాణ్ వెంటనే జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని కోరారు. అలా తనని నమ్మి వస్తే పవన్‌ను ఇంటర్నేషనల్ యాక్టర్ చేస్తానని హామీ ఇచ్చారు.”పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ప్రజాశాంతి పార్టీలో చేరిపోండి. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మోఢీ, చంద్రబాబు, లోకేష్ జెండాలు మోయకుండా.. మన జెండా మోసుకుందాం.. కాపులం 27 శాతం ఉన్నాం. ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు. నిన్ను ప్యాకేజ్ స్టార్ అని తిడుతున్నారు. ఈ అడుక్కునే బతుకు మనకు అవసరమా. నువ్వు బీజేపీని గెలిపించమని 100 జన్మలు ఎత్తినా ఓటు వేయరు. వెంటనే జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి. పవన్ నిన్ను ఇంటర్నేషనల్ యాక్టర్ చేస్తాను.. నా మాట నమ్ము..” అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news