ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ , బీజేపీ ల తర్వాత కొంచెం ప్రాధాన్యత కలుగుతోన్న పార్టీల్లో జనసేన ఒకటి.. ఈ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తగినంత కృషి చేస్తున్నా ఫలితం అంతంతమాత్రమే. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ మరియు బీజేపీలు కలిసి వైసీపీని ఓడించడానికి పన్నాగాలు పన్నుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కాగా తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ విశాఖపట్టణం లో దీక్ష చేస్తుండగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పాల్ మాట్లాడుతూ.. గతంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశాడు, ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తన జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. దానికంటే ముందుగా పవన్ కళ్యాణ్ ను జనసేనను నా పార్టీలో విలీనం చేయమంటూ అంటూ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
అంతే కాకుండా ఈ విధంగా చేస్తే పవన్ కళ్యాణ్ ను నేను ఇంటర్నేషనల్ యాక్టర్ ను చేస్తానంటూ కే ఏ పాల్ చెప్పాడు. మరి ఈ ఆఫర్ ను పవన్ కళ్యాణ్ స్వాగతిస్తాడా ?