ఏపీలో ఈ సారి విజయం తమదే నంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు…ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈ మధ్య కాలంలో టీవీ, సామాజిక మాధ్యమాల్లో తన పార్టీ విజయం సాధించడం పక్కా అంటూ పలు ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తమ పార్టీ తరఫున పోటీచేసే తొలి అభ్యర్థి పేరు సైతం నేడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత ప్రాంతాల ప్రాతిపదికన విభేదాలు తమ పార్టీలో లేవన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో తెదేపా నేత, నటుడు బాలకృష్ణకు పోటీగా ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి పేరుని పాల్ వెల్లడించారు. దీంతో హిందూపురంలో ప్రజాశాంతి పార్టీ చేతిలో బాలకృష్ణ ఓడిపోవడం ఖాయమన్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీతులసి అనే యువతిని అమలాపురం నియోజకవర్గం నుంచి బరిలో దింపుతున్నట్టు తెలిపారు. 150 కోట్ల ముస్లింల అండగా నిలబడి తాను అమెరికాతో పోరాడ అన్నారు. ఆర్జీవీ, పవన్, కేటీఆర్, జగన్‌లు తనతో 100, 200, 300, 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని గెలవాలని సవాల్ విసిరారు. అయితే ఇప్పటికే పాల్ వ్యాఖ్యలను పలు, ఆయన వ్యవహార శైలిని చూసి పలువురు కడుపుబ్బ నవ్వుకునే సంగతి తెలిసిందే.