సీనియ‌ర్ హీరోల‌ను న‌మ్ముకుంటున్న ఆ ఇద్ద‌రు హీరోయిన్లు!

-

ఇండ‌స్ట్రీలో హీరోల‌కు ప‌ర్మినెంట్‌గా అవ‌కాశాలు వ‌స్తూనే ఉంటాయి. కానీ హీరోయిన్ల‌కు ఏజ్ అయిపోతున్న కొద్దీ త‌గ్గిపోతుంటాయి. ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఇదే తంతు న‌డుస్తుంది. ఇక ఇదే కోవ‌లోకి వ‌స్తున్నారు ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు కాజ‌ల్‌, త‌మ‌న్నా. వీరిద్ద‌రికీ గ‌త కొద్ది కాలంగా యంగ్ స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.

దీంతో టాలీవుడ్‌లో సీనియర్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ల‌ను న‌మ్ముకుంటున్నారు. ఈ సీనియ‌ర్ హీరోలు ఇంకా జోరుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. వీరి స‌ర‌స‌న న‌టించేందుకు కుర్ర హీరోయిన్లు ముందుకు రావ‌ట్లేదు.

దీంతో ఈ ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు వారికి ఆప్ష‌న్‌గా మారిపోయారు. ఇప్ప‌టికే కాజ‌ల్ మూడు వ‌రుస సినిమాలతో, అటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. చిరుతో కాజ‌ల్ ఇప్ప‌టికే రెండు సినిమాలు చేసింది. ఇక త‌మ‌న్నా కూడా వెంక‌టేశ్ స‌ర‌స‌న రెండోసారి న‌టిస్తోంది. ఇక పై కూడా సీనియ‌ర్ స్టార్ హీరోల‌కు ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లే ఛాయిస్‌గా మార‌బోతున్నారన్న‌మాట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version