అలాంటి రాజకీయాలకు వ్యతిరేకం: కమల్ హాసన్

-

ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడైన కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చూశారు తమ పార్టీ ఇండియా కూటమిలో చేరలేదని స్పష్టం చేశారు. ఎం ఎన్ ఎం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమిళనాడులో చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడారు దేశాభివృద్ధి నిస్వార్థంగా పనిచేసే పార్టీకి మద్దతిస్తుంది మా పార్టీ అని అన్నారు.

ఫ్యూడల్ రాజకీయాలు చేసే వాళ్లతో తమ పార్టీ చేతులు కలపబోదని అన్నారు అటువంటి పాలిటిక్స్ కి దూరంగా ఉంటామని అన్నారు. ఇండియా కూటమిలో చేరలేదని కానీ రాజకీయ పొత్తుల పై చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు ప్రస్తుతం దేశం గురించి ఆలోచించే సమయామని తనకు దేశ అభివృద్ధి కోసం పని చేసే ఏ కూటమిలోనైనా చేరెందుకు సిద్ధమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version