కమల్‌ ‘విక్రమ్‌’ తెలుగు ట్రైలర్‌ అరాచకం..

-

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న తాజా సినిమా విక్ర‌మ్. ఈ సినిమా గురించి కమల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో మరోసారి కమల్ అరాచకం సృష్టించారు. అడ‌వి అన్నాక సింహం, పులి, చిరుత అన్నీ వేట‌కెళ్తాయి. జింక త‌ప్పించుకోవాల‌ని చూస్తుంది. ఆ లోపు సూర్యాస్త‌మయం అయితే సూర్యోద‌యాన్ని చూడ‌బోయేది ఎవ‌రు అనేది ప్ర‌కృతి నిర్ణ‌యిస్తుంది. కానీ ఈ అడ‌విలో వెలుగు ఎక్క‌డ, ఎప్పుడు అని నిర్ణ‌యించేది ప్ర‌కృతి కాదు..నేను..అంటూ క‌మ‌ల్ హాస‌న్ వాయిస్ ఓవ‌ర్‌తో సాగుతున్న ట్రైల‌ర్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సాగుతూ మాస్ ఆడియెన్స్ ను బాగా ఆక‌ట్టుకుంటోంది.

VIKRAM - Official Trailer | Kamal Haasan | VijaySethupathi, FahadhFaasil |  LokeshKanagaraj | Anirudh - YouTube

ఇప్ప‌టికే మేక‌ర్స్ త‌మిళ‌ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. క‌మ‌ల్ హాస‌న్‌, ఫ‌హ‌ద్ ఫాసిల్‌, విజ‌య్ సేతుప‌తిల‌పై వ‌చ్చే యాక్ష‌న్ పార్టు సినిమాకు హైలెట్‌గా నిలువ‌నుంద‌ని ట్రైల‌ర్‌తో స్ప‌ష్ట‌మ‌వుతుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్ క‌మ‌ల్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌, రెడ్ జియాంట్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై క‌మ‌ల్ హాస‌న్‌-మ‌హేంద్ర‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 13న‌ తెలుగు, త‌మిళంతోపాటు ప‌లు భారతీయ భాష‌ల్లో విడుద‌ల కానుంది విక్ర‌మ్.

Read more RELATED
Recommended to you

Latest news