వరండాలో నిద్రిస్తున్న యువతిపై అత్యాచారం.. ఆ తరువాత..

-

సమాజంలో రోజురోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. అంతేకాకుండా తమ పుత్రుడు పుణ్యం కార్యం చేసిన విధంగా వారి తల్లిదండ్రులు వ్యవహరించే తీరు మరింత బాధకరం.. అలాంటి ఘటనే ఇది. ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో పంచాయితీ పెట్టడంతో గ్రామ పెద్దలు వివాహం చేసుకోవాలని తీర్పు ఇచ్చారు. దీంతో తీర్పుకు ఒప్పుకొని తాళి కట్టిన ఆ ప్రబుద్ధుడు.. ఆ తరువాత కట్నం కావాలంటూ.. బలవంతం చేశాడు. అంతేకాకుండా ఆ యువకుడి కుటుంబీకులు సైతం బాధిత యువతి కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగ్లౌర్​ కొత్వాలీ ప్రాంతానికి చెందిన యువతి తల్లిదండ్రులు ఏప్రిల్​ 13న వైద్యం కోసం రిషికేశ్​ ఎయిమ్స్​కు వెళ్లారు. అర్ధరాత్రయినా తిరిగి రాలేదు.

Take Off Clothes Images – Browse 41,698 Stock Photos, Vectors, and Video | Adobe Stock

దీంతో తన సోదరుడు, సోదరితో కలిసి వరండాలో నిద్రపోయింది బాధితురాలు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇంట్లోకి ప్రవేశించి యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. గన్​తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక తనపై జరిగిన అఘాయిత్యం గురించి వారికి చెప్పింది బాధితురాలు. ఆ వెంటనే నిందితుడి ఇంటికి వెళ్లి ఆందోళన చేశారు ఆమె కుటుంబ సభ్యులు. మొజ్జిజ్​ కమ్యూనిటీకి చెందిన పెద్దలు పంచాయతీ నిర్వహించి.. ఇరువురికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. మే 16న వారి వివాహం జరిపించారు. మే 17న పెళ్లిని రిజిస్టర్​ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే యువకుడి కుటుంబ సభ్యులు రూ.5 లక్షలు, ద్విచక్రవాహనం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ విషయంపై బాధితురాలి బంధువులు మాట్లాడేందుకు ప్రయత్నించగా.. నిందితుడి కుటుంబ సభ్యులు వారిపై దాడి చేశారు. ఈ దాడిలో యువతి బంధువులకు గాయాలయ్యాయి.బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడి కుటుంబ సభ్యుల్లోని 8 మంది దానీశ్​, రాఫా, ఇద్రీస్​, పప్పూ, ఫరూక్​, నాజీమ్​, ప్రమోద్​, అశోక్​​పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసును మహిళా ఎస్సై అన్షు చౌదరికి అప్పగించామని మంగ్లౌర్​ కొత్వాలీ ఎస్​ఎస్​ఐ రఫత్​ అలీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news