BREAKING : మరోసారి ఆస్పత్రిలో చేరిన కమల్ హాసన్

-

తమిళ్‌ స్టార్‌ హీరో, రాజకీయ నాయకుడు కమల్‌ హాసన్‌ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఆయన ఉదయం నుంచి ఆస్వస్థతకు గురి కావడంతో… చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కమల్‌ హాసన్‌ ను చేర్పించినట్లు సమాచారం అందుతోంది.

అయితే.. కమల్‌ హాసన్‌ ఎందుకు ఆస్పత్రిలో చేరాడు.. అసలేం జరిగింది… అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. జనరల్‌ చెక్‌ అప్‌ కోసమే కమల్‌ హాసన్‌ ఆస్పత్రిలో చేరారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే.. దీనిపై మరి కాసేపట్లోనే క్లారిటీ రానుంది.

కాగా…. నెల రోజుల కిందటే హీరో కమల్‌ హాసన్‌ కరోనా బారీన పడ్డారు. దీంతో ఆ సమయంలో… చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు కమల్‌ హాసన్‌. దాదాపు 10 రోజుల పాటు చికిత్స పొందిన ఆయన.. అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే.. ఇవాళ మరోసారి కమల్‌ హాసన్‌ ఆస్పత్రి లో చేరడం తో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version