మళ్ళీ ఏపీలో కాపు ఉద్యమం మొదలైంది..అగ్రవర్గాల పేదలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించలంటూ కాపుసేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య నిరవధిక దీక్షకు దిగిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు జోగయ్య దీక్షని భగ్నం చేసి ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ట్రీట్‌మెంట్‌కు సహకరించడం లేదని తెలిసింది. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్..జోగయ్య ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
అయితే జోగయ్యకు మద్ధతుగా ఎక్కడకక్కడ కాపు నేతలు దీక్షలకు దిగుతున్నారు. ఇప్పటికే మచిలీపట్నంలో కాపు నేతలు దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ కాపు రిజర్వేషన్ల అంశం వైసీపీ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసేలా ఉంది. ఎందుకంటే గత చంద్రబాబు ప్రభుత్వం కాపు రిజర్వేషన్లని అమలు చేయాలని చెప్పి ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి..టీడీపీకి డ్యామేజ్ చేశారు.
అప్పుడు కాపు రిజర్వేషన్లు కుదరకపోయిన కేంద్రం ఇచ్చిన అగ్రవర్ణాల పేదలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇచ్చారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఒక కులానికి 5 శాతం కేటాయించడం కుదరదని, టోటల్ గా 10 శాతం ఆపేశారు. దీనిపై తాజాగా కేంద్రం..10 శాతం రిజర్వేషన్ల అమలు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని చెప్పింది..దీంతో కాపులకు 5 శాతం ఇవ్వాలని జోగయ్య డిమాండ్ చేస్తూ వచ్చారు.
కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో దీక్షకు దిగారు..ఇప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పవన్ స్పందించారు. రాష్ట్రంలో కాపు నేతలు స్పందిస్తూ..దీక్షలకు దిగుతున్నారు. మరి ఈ కాపు రిజర్వేషన్ల అంశం జగన్ ప్రభుత్వానికి పెద్ద చిక్కులు తెచ్చే పెట్టేలా ఉంది.