బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు.. బాలీవుడ్ హీరోలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.. సిని నిర్మాణరంగంలో ఉంటూ తను ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అంతేకాకుండా కోటలో నష్టపోయానంటూ చెప్పుకొచ్చారు..
నిర్మాత కరణ్ జోహార్ తాజాగా బాలీవుడ్ సినిమాలపై హీరోలపై పలు వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా కొందరి హీరోలను దుమ్మెత్తి పోశారు.. వారి సినిమాలు ఫస్ట్ డే కూడా ఆడే అవకాశం ఉండదు కానీ వాళ్లకి కోట్లలో రెమ్యూనరేషన్ కావాలి అంటే ఎలా అవుతుంది అంటూ ఫైర్ అయ్యారు..
అయితే హీరోలు కోట్లలో రెమ్యూనరేషన్ అడుగుతూ ఉంటారని కానీ ఇది ఇవ్వటానికి ఎలా సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు.. ఒకవేళ రెమ్యూనరేషన్ ఆ రేంజ్ లో కావాలి అంటే వారి సినిమాలు కూడా అదే రేంజ్ లో హిట్ అవ్వాలి కదా అంటూ ప్రశ్నించారు.. అలాగే కొన్ని సినిమాలు చేసి ఆ హీరోల వల్ల కోట్లలో నష్టపోయానని తెలిపారు.. “ఒక సినిమా తీయాలని ఎంతో ఆశగా ఒక హీరో దగ్గరికి వెళితే వారు కోట్లలో డిమాండ్ చేస్తూ ఉంటారు.. తీరా చూస్తే ముందు విడుదలైన వారు ఏ సినిమా కూడా అంత డబ్బులు వసూలు చేసే ఉండదు.. మరి ఇలాంటి అప్పుడు అంత రెమ్యూనరేషన్ ఇవ్వటం ఎలా సాధ్యమవుతుంది.. ఇలా మాట్లాడుతున్నందుకు చాలా మందికి కోపం వస్తుంది కానీ ఇది నిజం.. ఎవరైనా ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ఎంతగానో హిట్ అయింది కానీ ఈ సినిమా వల్ల నేను నష్టపోయాను సినిమా అయితే మంచి పేరు సంపాదించుకుంది కానీ నేనైతే ఆర్థికంగా చాలా నష్టపోయాను..” అంటూ చెప్పుకోవచ్చారు కరణ్ జోహార్