ఆ విషయంలో లోకేష్ మరీ అడ్డంగా దొరికేస్తున్నాడు!

-

ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడో ఆరోజు మొదలు నారా లోకేష్ స్థాయిపై ఇంటా బయటా తీవ్రస్థాయిలో విమర్శల వర్షాలు కురుస్తున్నాయి. లోకేష్ గురించి ఎవరు ఏ విమర్శలు చేసినా ముందుగా “ఎమ్మెల్యేగా కూడా గెలవలేని” నుంచే మొదలవుతుండటం గమనార్హం. లోకేష్ కూడా తన స్థాయి దాటే ఇతరపార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… నిన్న అవంతి శ్రీనివాస్ లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే కానీ.. గత ఎన్నికల్లో టీడీపీ ఆ స్థాయిలో ఓడిపోవడానికి నారా లోకేషే కారణం అని మొదలుపెట్టిన అవంతి… ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నీకు జగన్ ను విమర్శించే స్థాయి ఉందా అంటూ ముగించారు. ఇదే క్రమంలో మరో టీడీపీ నేత కూడా లోకేష్ పై ఫైరయ్యారు.

తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రైన క‌ర‌ణం బ‌లరాం.. టీడీపీ 10 యేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా ఆ పార్టీలోనే కొన‌సాగారు. పార్టీ త‌ర‌ఫున అనేక మంది సీనియ‌ర్లు, మంత్రులు, చంద్ర‌బాబు నాయుడి త‌న‌యుడు కూడా ఓడిపోయిన ఎన్నిక‌ల్లో క‌ర‌ణం బ‌లరాం నెగ్గి వ‌చ్చారు. అయితే ఆయ‌న ఇప్పుడు టీడీపీ అస‌మ్మ‌తి స్వ‌రం వినిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడి త‌న‌యుడు లోకేష్ కు త‌న గురించి మాట్లాడే స్థాయి లేద‌ని అంటున్నారు ఆ పార్టీ సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌లరాం. త‌న గురించి లోకేష్ ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది అని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడు కరణం బలరాం కూడా… తన గురించి మాట్లాడే స్థాయి లోకేష్ కు లేదు అన్నారంటే… దాని అర్ధం కూడా “ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు” అనే అనుకోవచ్చు! మిగిలిన సంగతులు కాసేపు పక్కనపెడితే… మంత్రిగా పనిచేసి, పార్టీ అధినేత కొడుకుగా ఎన్నికల్లో పోటీచేసినా కూడా లోకేష్ ఓడిపోవడం నిజంగా పెద్ద దెబ్బే! దీంతో… చంద్రబాబు కొడుకు అన్న క్వాలిఫికేషన్ తప్ప లోకేష్ కు ఏ అర్హత ఉందనే విమర్శలు పెరిగిపోతున్నాయి. ఆ ఒక్క విషయంలో లోకేష్ ను మరీ ఆడేసుకుంటున్నారు వైకాపా నేతలు. ఈ క్రమంలో కరణం బలరాం లాంటి టీడీపీ సీనియర్ నేతలు కూడా లోకేష్ పై అలాంటి విమర్శలే చేస్తుండటం గమనార్హం. ఆ ఓటమి అంతపనిచేసిందన్నమాట!!

Read more RELATED
Recommended to you

Latest news