కలెక్టరా.. మజాకా.. డ్యాన్స్ ఇరగదీశాడు..

-

కలెక్టర్ విధులు నిర్వర్తించడం మాత్రమే కాదు..డ్యాన్స్ ను కూడా ఇరగదీస్తారని ఓ కలెక్టర్ నిరూపించాడు..చుట్టూ ఎందరు ఉన్న ఆయన మ్యాజిక్ వినపడగానే దుమ్ము రేపాడు.ఆ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో ను ఒకసారి చూద్దాం…

కర్ణాటకలోని ఓ జిల్లా కలెక్టర్ గోపాల కృష్ణ డ్యాన్స్ తో దుమ్మురేపారు. ఫుల్ ఎనర్జిటిక్ తో స్టేజీపైనే ఇరగదీశారు. డ్యాన్స్ మాస్టర్ ను మరిపించేలా స్టెప్పులతో అదరగొట్టారు.హెచ్‌డిఎంసి ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమం లో భాగంగా కన్నడ సాంగ్ కు డ్యాన్స్ వేశాడు.

కలెక్టర్ డ్యాన్స్ ను చూసిన విద్యార్థులు, అధికారులు, స్థానికులు అందరూ ఫుల్ ఫిదా అయ్యారు. కలెక్టర్ స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగా అందరూ కేరింతలు కొట్టారు. ఆయన ఉత్సాహాన్నిచూసి అందరూ ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. హుబ్బళ్లి- ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. గోపాల్ కృష్ణ ఇటీవల ధార్వాడలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు..తనకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని గతంలో చాలాసార్లు చెప్పాడు.. ఇప్పుడు ఆయన వేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..కలెక్టర్ అంటే ఆ మాత్రం ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఆ వీడియోను ఒకసారి చూడండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version