కర్ణాటక రాష్ట్రంలో 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఈ రోజు ముగిశాయి. ఇక ఈ రోజు జరిగిన ఎన్నికలలో ఎవరు గెలవనున్నారు అన్న విషయం తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మే 12వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగి అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. కాగా ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో బీజేపీ ఉండగా, ప్రతిపక్షములో కాంగ్రెస్ ఉంది. కాగా ఇప్పుడు కర్ణాటకలో ఉన్న రాజకీయ పార్టీలు అంతా కూడా ఎగ్జిట్ పోల్స్ పైన తమ దృష్టిని కేంద్రీకరించనున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వాటిలో బీజేపీ, కాంగ్రెస్, జీడీఎస్ మరియు ఇతర స్థానిక పార్టీలు ఉన్నాయి.
కాగా ఏ పార్టీ గెలుస్తుందో అన్న ఉత్కంఠలో అన్ని పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ రెండు రోజులు కంటి మీద కునుకులేఉండా ఉంటాయి.