శర్వానంద్ ‘ఒకేఒక జీవితం’ మూవీ కోసం కార్తీ

-

హీరో శర్వానంద్‌.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ గత ఏడాది మొదట్లో శ్రీకారం సినిమాతో ముందుకు వచ్చిన శర్వానంద్‌.. మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన… మహా సముద్రం పెద్దగా ఆకట్టుకోకపోయినా.. పర్వాలేదనిపించాడు. అలాగే… ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రం యావరేజ్ హిట్ అయింది. అయితే.. శర్వానంద్‌ హీరోగా శ్రీకార్తీక్‌ డైరెక్షన్‌లో మరో చిత్రం రూపుదిద్దుకుంటోంది.

ఈ మూవీలో హీరోయిన్‌గా పెళ్లి చూపులు ఫేం.. రీతూ వర్మ నటిస్తోంది. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి అమల గారు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి మూడో పాట రేపు రిలీజ్‌ కానుంది. అయితే.. ఈ సాంగ్‌ ను హీరో కార్తీ పాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అధికారిక పోస్టర్‌ రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 9 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version