ఓమిక్రాన్ నేపథ్యంలో బూస్టర్ డోస్ పై ఈయూ కీలక నిర్ణయం…

-

కరోనా ఓమిక్రాన్ కేసులు యూరోపియన్ యూనియన్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రతీ రోజూ ఈ దేశాల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా యూకే, డెన్మార్క్ దేశాల్లో ఓమిక్రాన్ విలయతాండవం చేస్తోంది. ఇటీవల కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తో యూకేలో తొలి మరణం సంభవించింది. దీంతో యూరోపియన్ దేశాలు బూస్టర్ డోసుపై కీలక నిర్ణయం తీసుకున్నాయి. బూస్టర్ డోసుగా జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు అనుమతి ఇచ్చింది. దీనికి ఈయూ డ్రగ్‌ రెగ్యులేటర్‌ బుధవారం అనుమతి కూడా ఇచ్చింది.

యూరోపియన్ యూనియన్ దేశాల్లో మొదటి, రెండు డోసులుగా ఫైజర్ బయోఎన్ టెక్ లేకపోతే మోడెర్నా టీకాలు ఇచ్చారు. అయితే బూస్టర్ డోసుగా జాన్సన్  అండ్ జాన్సన్ టీకాకు అనుమతి ఇచ్చింది ఈయూ. యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (EMA) నిర్ధారించిన వ్యాక్సిన్ల (mRNA)లో ఏదైనా ఒక టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత మూడో డోసుగా జాన్సన్ అండ్ జాన్సన్ టీకానను సిఫారసు చేశారు. ప్రస్తుతం యూరప్ వ్యాప్తంగా కేసులు ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో బూస్టర్ డోసుకు ప్రాధాన్యత ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news