తిమ్మాపూర్​ను దత్తత తీసుకున్న కశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్

-

ది కశ్మీర్ ఫైల్స్ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అభిషేక్ అగర్వాల్ కుటుంబం స్థాపించిన చంద్రకళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లోని జేఆర్​సీ కన్వెన్షన్‌ సెంటర్ లో చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక దివస్‌లో ఈ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై దత్తత గ్రామం తిమ్మాపూర్ మైలు రాయిని ఆవిష్కరించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ గ్రామంలోని పలువురు విద్యార్థినీ విద్యార్థులకు కంప్యూటర్లు కానుకగా అందజేశారు.

ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న అభిషేక్ అగర్వాల్ ఆ తర్వాత టాలీవుడ్​లో కార్తికేయ-2, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news