భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ హీరోయిన్స్‌లలో కత్రినా కైఫ్ ఒకరు. మోడల్ నుంచి నటిగా మారిన కత్రిన ‘బూమ్’ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ‘జరా జరా టచ్ మి’, ‘చిక్నీ చమేలీ’, ‘షీలా కీ జవానీ’…’ఖ్వాబ్ దేఖే’ వంటి సూపర్-హిట్ ఐటెమ్ సాంగ్స్‌తో కుర్రకారులో క్రేజ్ సంపాదించుకున్నారు.
సినిమాల్లోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ ఎక్కువే. దాదాపు 65 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న కైఫ్… బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఇంతకీ ఆమె ఇన్‌స్టా ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు ఎంత సంపాదిస్తారో తెలుసా?
ఇండియన్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం పొందుతున్న టాప్ హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ ఒకరు. మోడల్ నుంచి నటిగా మారిన కత్రినా ‘బూమ్’ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 2005లో రిలీజైన రొమాంటిక్-కామెడీ చిత్రం ‘మైనే ప్యార్ క్యున్ కియా’ కత్రిన సినీ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత , ‘నమస్తే లండన్’, ‘వెల్‌కమ్’, ‘పార్టనర్’, ‘న్యూయార్క్’ లాంటి సినిమాలతో బిటౌన్లో బిజీ అయిపోయారు.
‘జరా జరా టచ్ మి’, ‘చిక్నీ చమేలీ’, ‘షీలా కీ జవానీ’…’ఖ్వాబ్ దేఖే’ వంటి కొన్ని సూపర్-హిట్ ఐటెమ్ సాంగ్స్‌తో కుర్రకారులో క్రేజ్ సంపాదించుకున్నారు. 2019లో కైఫ్.. తన కాస్మెటిక్ బ్రాండ్ కే బ్యూటీని ఈ-కామర్స్ కంపెనీ నైకా భాగస్వామ్యంతో ప్రారంభించారు. ఇందులో పలు రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లభ్యమవుతాయి. సినిమాల్లోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ ఎక్కువే.. దాదాపు 65 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న కైఫ్.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు.
తాజా మీడియా నివేదికల ప్రకారం, ఈ ‘చిక్నీ చమేలీ’ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు సుమారు రూ. 97 లక్షలు వసూలు చేస్తుందని సమాచారం. స్లైస్, నక్షత్ర, పానాసోనిక్, లాక్మే, లోరియల్, రీబాక్ ఇండియా, ఇమామి, లినో పెరోస్ లాంటి అగ్రగామి బ్రాండ్లకు ప్రమోషన్స్ చేస్తుంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ.. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన ‘జీ లే జరా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అలియా భట్, ప్రియాంక చోప్రా కూడా నటించారు. దీంతో పాటే ‘ఫోన్ భూత్’ అనే మూవీలో సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్‌తో కలిసి నటించారు.
కాగా, కెరీర్ ప్రారంభంలో తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి చిత్రాల్లోనూ కనువిందు చేశారు. ఆ తర్వాత బీటౌన్‌లో బిజీ అయిపోయారు.