KBC- సీజన్-14 లో రూ.కోటి గెలుచుకున్న గృహిణి

-

కౌన్ బనేగా కరోడ్​పతి హిందీలో ఈ షో ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ షో 14వ సీజన్​ పూర్తి చేసుకుంది. ఈ సీజన్​ విజేతగా మహరాష్ట్ర కొల్పూర్​ జిల్లా గాంధీనగర్​కు చెందిన ఓ గృహిణి కవితా చావ్లా నిలిచారు. ఆమె ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ విజయం వెనుక ఆమె 22 ఏళ్ల నిరీక్షణ ఉన్నట్లు కవిత చెప్పారు.

విజయ్ చావ్లా అనే వస్త్ర వ్యాపారితో వివాహం జరిగాక కవిత ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి పట్టునే ఉండే ఆమె 22 ఏళ్ల క్రితం ప్రారంభమైన కౌన్ బనేగా కరోడ్​పతి కార్యక్రమానికి ఆకర్షితులయ్యారు. ఎలాగైనా ఆ కార్యక్రమంలో పాల్గొని విన్నర్ అవ్వాలని కలగన్నారు. అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు. అలా 2013లో జరిగిన కేబీసీ సీజన్​లో టాప్​ 10కు ఆమె ఎంపికయ్యారు. కానీ హాట్​సీట్ వరకు వెళ్లకుండానే ఇంటికి వెనుదిరిగారు.

అయినా పట్టువీడని కవిత మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు సీజన్ 14లో హాట్​సీట్ వరకు వెళ్లారు. అమితాబ్ బచ్చన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకున్నారు. కవితా చావ్లా పాల్గొన్న ఎపిసోడ్ సోమ, మంగళవారాల్లో ప్రసారం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news