కవిత అధునాతన బతుకమ్మ అయిపోయింది – కోదండ రెడ్డి

-

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో ఎమ్మెల్సీ కవిత తో పాటు ప్రముఖులు ఉన్నట్లు ఆధారాలతో సహా వార్తలు వస్తున్నాయన్నారు జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి. పదవిలో ఉన్న వాళ్ళు నిజాయితీ ని నిరూపించుకోవాలన్నారు. కుంభకోణం జరిగింది అని చెప్పిన తరువాత వివరాలు బహిర్గతం చేయాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వం పై ఉందన్నారు.
బీజేపీ నేతలు కవిత ఇంటి దగ్గర ధర్నా చేశారు..కేంద్రంలో అధికారంలో ఉన్న మీరే చర్యలు తీసుకోవడం లేదు కదా? అని ప్రశ్నించారు.

ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవడానికి రెడీ గా ఉండాలని అన్నారు కోదండ రెడ్డి. మునుగోడు బహిరంగ సభ లో అమిత్షా కాళేశ్వరం ప్రాజెక్టు ని ఏటీఎం లా వాడుతున్నారు అని చెప్పారని.. మరి మీరు హోంమంత్రి గా ఉండి విచారణ సంస్థలతో ఎందుకు విచారణ జరిపించడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహార తీరు చూస్తే మీ మధ్య లాలూచీ ఉందని.. అందుకే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆరోపణలు వచ్చినప్పుడు చట్టసభల్లోనే రాజీనామా చేసే వారని.. విలువలు గల కాంగ్రెస్ ప్రజలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. బతుకమ్మ ను రాజకీయం చేస్తున్నారని.. కవిత అధునాతన బతుకమ్మ అపోయిందంటూ ఎద్దేవా చేశారు. కవిత ను బతుకమ్మ తో పోల్చితే తెలంగాణ మహిళలు ఉపేక్షించరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news