కారు వర్సెస్ కమలం..వార్ పీక్స్?

-

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్-బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది…అయితే రాజకీయంగా వార్ నడిస్తే పర్లేదు…కానీ నిదానంగా వ్యక్తిగతంగా రాజకీయం నడుస్తోంది. వ్యక్తుల పరంగా టార్గెట్ చేసుకుని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. రాజకీయ విధానాల పరంగా కాకుండా…వ్యక్తిగతమైన శతృత్వం పెంచుకుని నేతలు ముందుకెళుతున్నారు. అసలు రాజకీయ పరంగానే శతృత్వం ఉండాలి..కానీ టీఆర్ఎస్-బీజేపీలు వ్యతిగతమైన శతృత్వం పెంచుకుంటున్నాయి.అందుకే మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది…నేతల విమర్శల్లో  హుందాతనం కనిపించడం లేదు. ఎవరికి వారు బూతులు మాట్లాడే పరిస్తితి. అలాగే రెండు పార్టీలు ఏ విషయంలోనూ తగ్గడం లేదు. ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండటం,. అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో రెండు పార్టీలు దూకుడుగా రాజకీయం చేస్తున్నాయి. కేసీఆర్‌కు చెక్ పెట్టేసి బీజేపీని అధికారంలోకి తీసుకు రావాలని ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు. అలాగే బీజేపీకి ఏ మాత్రం అధికారం దక్కకుండా చేయాలని టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు.

ఇలా రెండు పార్టీల మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది…తాజాగా ఓ రెండు విషయాల్లో బాగా రచ్చ నడుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని అందులో కవిత కూడా ఉన్నారని…ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీలు ఆరోపించిన విషయం తెలిసిందే…దీనిపై కవిత, టీఆర్ఎస్ నేతలు తీవ్రంగానే ప్రతిఘటిస్తూ ఆ ఆరోపణలని ఖండించారు. అయితే ఈ అంశాన్ని తెలంగాణ బీజేపీ నేతలు రాజకీయంగా ఉపయోగించుకునే క్రమంలో…కవితని టార్గెట్ చేస్తూ కేసీఆర్‌ని దెబ్బకొట్టే విధంగా ముందుకెళుతున్నారు.

ఇదే క్రమంలో కవిత ఇంటి ముట్టడికి వెళ్ళిన బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు…అలాగే బీజేపీ వాళ్లపై కేసులు పెట్టారు. దీనికి నిరసనగా బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తే…పోలీసులని బండిని అడ్డుకున్నారు. ఇదే సమయంలో మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది…ఆయన్ని బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు కూడా. ఇక దీన్ని టీఆర్ఎస్ రాజకీయ అస్త్రంగా మలుచుకుని బీజేపీపై విరుచుకుపడుతుంది. ఇలా రెండు పార్టీలు హీట్ పాలిటిక్స్ నడిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news