కారు నేతల కామెడీ…కేసీఆర్‌కు మోదీ భయపడ్డారా!

-

రైతులకు ప్రతిబంధకంగా మారిన కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో మోదీ సర్కార్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఊహించని రీతిలో తాజాగా మోదీ…ఆ చట్టాలని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కొత్త సాగు చట్టాలపై దాదాపు ఏడాదిగా అలుపెరగని ఆందోళన చేస్తున్న రైతుల దెబ్బకు మోదీ సర్కారు వెనక్కి తగ్గిందని గట్టిగా చెప్పొచ్చు. ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా చేసిన ఆ మూడు చట్టాలనూ రద్దు చేశారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

రైతు ఉత్పత్తుల వాణిజ్య, వర్తక చట్టం – 2020, రైతుల ధరల హామీ, వ్యవసాయ సేవల చట్టం – 2020, నిత్యవసర సరుకుల సవరణ చట్టం – 2020ని గత ఏడాది సెప్టెంబరు నెలలో పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా పోరాటాలు చేస్తున్నారు. ఈ ఉద్యమంలో పలువురు రైతులు కూడా చనిపోయారు. ఇంత జరిగినా వెనక్కి తగ్గని మోదీ సర్కార్..త్వరలో పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాలని రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చట్టాల రద్దుపై దేశవ్యాప్తంగా రైతులు, ప్రతిపక్ష పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై స్పందిస్తున్నారు. కాకపోతే ఇది రైతుల విజయమని కాకుండా, కేసీఆర్ అంటే భయం వల్లే మోదీ చట్టాలని రద్దు చేశారని డప్పు కొట్టుకుంటున్నారు.

తాజాగా ధాన్యం కొనుగోలు అంశంలో కేసీఆర్..ధర్నా చౌక్‌లో రెండు గంటల పాటు ధర్నా చేశారు. ఆ వెంటనే మోదీ..సాగు చట్టాలని వెనక్కి తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ పోరాట శైలి బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి తెలుసని.. సాగు చట్టాలపై కేసీఆర్‌ ఉద్యమిస్తే ఉత్తరాది రైతు ఆందోళనలు దక్షిణాదికి విస్తరించి, కేంద్ర ప్రభుత్వ ఉనికికే ముప్పని ప్రధాని మోదీ భావించినట్లు తెలుస్తోందని, అందుకే సాగు చట్టాలని రద్దు చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు కేసీఆర్ దీక్ష చేశారనే సంగతి మోదీకి తెలుసు లేదో…కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం మా నాయకుడుని చూసి భయపడ్డారని తెగ కామెడీ చేసేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news