కడప జిల్లాలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కడప జిల్లాలోని చెయ్యేరు నది.. భారీ వరదల తో పొంగిపొర్లుతోంది. ఈ నేపథ్యం లోనే ఆ నదీ ప్రవాహంలో ఏకంగా 26 మంది గల్లంత య్యారు. అయితే ఇందులో 14 మృత దేహాలను ఇప్పటికే అధికారులు అధికారికంగా గుర్తించారు.
మరికొందరి కోసం అధికారులు గాలిస్తున్నారు. పూల పుత్తూరులో పది మంది గల్లంతు కాగా… ఎగువ అలాగే దిగువ మందపల్లిలో ఏకంగా 13 మంది గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. అయితే 26 మంది పూల పుత్తూరు, మందపల్లి కి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. అయితే ఈ ఘటనలో పూజారి రామ్మూర్తి కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇందు లో ఇప్పటి వరకు ఒక మహిళ మృతదేహం మాత్రమే లభ్యమైందనీ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటకు రాకూడదు అని హెచ్చరికలు జారీ చేశారు.