జగిత్యాల జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ ఇడి లు ఐటీలు ఎన్నికలు ఉండే రాష్ట్రాలలో ముందే వస్తాయని.. ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడబోమని స్పష్టం చేశారు. ఈ నెల 7న సీఎం కేసీఆర్ జగిత్యాల రానున్నారని వెల్లడించారు.
నూతన కలెక్టరేట్,టిఆర్ యస్ పార్టీ కొత్త కార్యాలయం,మెడికల్ కాలేజిని సిఎం కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభం అవుతుందని.. జగిత్యాల జిల్లా కేసీఆర్ వల్లనే అయిందని తెలిపారు. ఇకా
ఈ పర్యటన ఏర్పాటు చేశామని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. కేంద్రం 42 శాతం నిందలు ఇచ్చాము అన్నారు కానీ 29 శాతం మాత్రమే ఇచ్చారన్నారు. కొన్ని పథకాలు రద్దు చేసి వేల కొట్ల రాష్ట్ర వాటా తగ్గించారని.. కేంద్రం ఇచ్చింది ఎంత రాష్ట్రం కేంద్రానికి ఇచ్చింది ఎంతో అని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి సోయి ఉండి మాట్లాడతాడా లేదా అన్నది తెలియట్లేదని.. కిషన్ రెడ్డి కి ఛాలెంజ్ చేస్తున్నా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా తెల్చుకుందమా అని హరీష్ రావు సవాల్ విసిరారు. బండి సంజయ్ మాటలకు తలా తోక లేదని విమర్శలు చేశారు. దేశం నెలకు లక్ష కోట్ల అప్పు తెస్తున్నారు..గడిచిన ఆరునెలల్లో కోటి కోట్ల అప్పులు తెచ్చారన్నారు.