ఎమ్మెల్యేలతో కేసీఆర్ మైండ్‌గేమ్..షాక్ తప్పదా!

-

రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేయాలి..ఎలా ప్రత్యర్ధులకు చెక్ పెట్టాలనే వ్యూహాలు వేయడంలో తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. వ్యతిరేక పరిస్తితులని సైతం తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కే‌సి‌ఆర్ ధిట్ట అని చెప్పాలి. ఇప్పటికే రెండుసార్లు గెలిచి అధికారం కైవసం చేసుకున్న కే‌సి‌ఆర్..మూడోసారి కూడా అధికారంలోకి రావాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు ప్రత్యర్ధి పార్టీలు కాంగ్రెస్, బి‌జే‌పిలని ఎక్కడకక్కడ నిలువరిస్తూనే..సొంత పార్టీలోని లొసుగులు బయటపడకుండా చూసుకుంటున్నారు.

ఆఖరికి సొంత పార్టీ నేతలతో కూడా కే‌సి‌ఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సీట్ల విషయంలో మైండ్ గేమ్ ఆడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇస్తానని కే‌సి‌ఆర్ పలుమార్లు ప్రకటించారు. అయితే అందరికీ సీట్లు ఇస్తే బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం ఉండదా? అంటే ఖచ్చితంగా నష్టం జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. వారికి మళ్ళీ సీట్లు ఇస్తే పార్టీకి దెబ్బ.

అలా అని వారికి ఇప్పుడే సీట్లు లేవని చెప్పిన దెబ్బ తప్పదు. పైగా బి‌జే‌పి ఏమో తమకు బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మైండ్ గేమ్ ఆడుతుంది. అలాంటి సమయంలో కొందరి సీట్లు లేవని చెబితే వారు జంప్ అయిపోతారు. అప్పుడు కూడా బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టమే. ఆ పరిస్తితి రాకూడదని అందరికీ సీట్లు అని కే‌సి‌ఆర్ ప్రకటించారు.

కానీ అందరికీ సీట్లు ఇవ్వడం జరిగే పని కాదు. దాదాపు 20 పైనే ఎమ్మెల్యేలకు కే‌సి‌ఆర్ టికెట్ ఇవ్వడం కష్టమని తెలుస్తోంది. కాకపోతే ఎన్నికల సమయంలోనే సీట్లపై తేల్చనున్నారు. అప్పటివరకు అందరికీ సీట్లు అని చెప్పి రాజకీయం నడిపించనున్నారు. మొత్తానికైతే కొందరు ఎమ్మెల్యేలకు మాత్రం షాప్ తప్పదని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news