కేసీఆర్ ని చూసి తెలంగాణా బిజెపి షాక్…!

-

సాధారణంగా రాజకీయాల్లో కేసీఆర్ ని అంచనా వేయడం అనేది ముందు నుంచి కాస్త కష్టమే. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన రాజకీయాన్ని పక్కన పెడితే ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఆయన రాజకీయం ఎవరికి అంత తేలికగా అర్ధమయ్యే పరిస్థితి లేదు. తనను పదే పదే టార్గెట్ చేస్తున్న విపక్షాలను ఆయన నిర్వీర్యం చేసిన తీరు సహా కొన్ని కొన్ని అంశాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షాన్ని ఆయన టార్గెట్ చేసిన తీరు చూసి తెలంగాణాలో కేసీఆర్ వ్యతిరేక శక్తులు అనేవి లేకుండా పోయాయి.

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన కరోనా విషయంలో తన మీద ఎవరూ విమర్శలు చేయకుండా రాజకీయం చేస్తున్నారు. కరోనా కట్టడిలో మోడీ సర్కార్ కి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. మర్కాజ్ యాత్రికుల విషయంలో ధైర్యంగా లెక్కలు బయటపెట్టడమే కాదు వాళ్ళను ఎక్కడా వెనకేసుకుని వచ్చే వ్యాఖ్యలు చేయలేదు ఆయన. దీనితో తెలంగాణా బిజెపి షాక్ అయింది. కేసీఆర్ ని టార్గెట్ చేయడానికి దాన్ని ఎంచుకోవాలని చూసినా ఆయన మాత్రం అదే స్థాయిలో సమాధానం చెప్పారు.

ఇక ప్రజలకు నిత్యావసర సరుకులను అందించే విషయంలో కూడా కేంద్రం చేసిన సాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని ఆయన ఉన్నదీ ఉన్నట్టు చెప్పారు. లాక్ డౌన్ కావాలని మోడిని మీడియా ద్వారా అడిగారు. అలాగే మోడీ విషయంలో ఎవరైనా విమర్శలు అనవసరంగా సోషల్ మీడియాలో చేస్తుంటే వాటిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జనతా కర్ఫ్యూ గాని, లాక్ డౌన్ గాని, కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు గాని, కేంద్ర ఆర్ధిక పరిస్థితి గాని అన్నీ కూడా ఆయన వివరించారు. చప్పట్లు కొట్టే పిలుపు గాని దీపాలను వెలిగించే పిలుపుని గాని ఆయన సమర్ధించి మద్దతు ప్రకటించి అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. దీనితో తెలంగాణ బిజెపి సైలెంట్ అయిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news