జాతీయ రాజ‌కీయాల్లోకి కేసీఆర్ రావాలి : రాకేశ్ టికాయ‌త్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో ఉన్న విషయం తెలిసిందే. కాగ ఆయ‌న ఢిల్లీలో దంత‌, కంటి స‌మ‌స్య‌ల‌పై చికిత్స అందుకున్నారు. కాగ నేడు ఆయ‌న హైద‌రాబాద్ కు తిరుగు ప్ర‌యాణం చేయ‌నున్నారు. అయితే ఈ రోజు భారతీయ కిసాన్ యూనియ‌న్ నాయ‌కుడు రాకేశ్ సింగ్ టికాయ‌త్ తో స‌మావేశం అయ్యారు. సీఎం కేసీఆర్ ఉంటున్న నివాసంలో రాకేశ్ టీకాయ‌త్, సుబ్ర‌హ్మ‌ణ్యం స్వామి చేరుకుని ప‌లు అంశాలపై చ‌ర్చించారు.

ఈ స‌మావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. కాగ స‌మావేశంలో దేశ వ్యాప్తంగా రైతుల ప‌రిస్థితులపై చ‌ర్చించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంంలో రైతు సంక్షేమ ప‌థ‌కాల గురించి కూడా చ‌ర్చించారు. వీరి మ‌ధ్య దాదాపు మూడు గంట‌ల పాటు స‌మావేశం జ‌రిగింది. అలాగే సాగు చ‌ట్టాల వ్య‌తిరేక ఉద్య‌మంలో మృతి చెందిన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఆర్థికసాయం పై చర్చించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాకేశ్ టికాయ‌త్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version