వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు పట్ల శ్రద్ధ తీసుకోవాలి. రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఆహారం, ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం ఇవ్వాలి. అలానే దోమలు కుట్టకుండా చూసుకోవడం, బయట ఆహారం తీసుకోకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.
ఎక్కువగా వానా కాలంలో దగ్గు, జ్వరం, డయేరియా మొదలైన సమస్యలు వస్తాయి. అందుకని పిల్లలకి తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. వానా కాలంలో పిల్లలకి ఎలాంటి పోషక పదార్థాలు ఇవ్వాలి అనేది చూస్తే..
ప్రోటీన్:
ప్రోటీన్ పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా చికెన్, గుడ్లు, పాలు, యోగర్ట్, పన్నీర్, కాటేజ్ చీజ్, సోయా, పీనట్ బటర్ లో ఉంటుంది. వీటిని ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి అందుతుంది.
ఐరన్:
బీన్స్, ఆకుకూరలు, గుడ్లు వంటి పదార్థాలలో ఐరన్ ఉంటుంది. ఐరన్ తక్కువగా ఉండడం వల్ల ఎనీమియా సమస్య వస్తుంది. అలానే ఆకుకూరలు లో పోలిక్ యాసిడ్, విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవి కూడా ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా కాలిఫ్లవర్, బ్రోకలీ వారానికి రెండుసార్లు ఇవ్వడం మంచిది.
విటమిన్ సి :
విటమిన్ సి కమలా, నిమ్మ, ద్రాక్ష వంటివాటిలో ఉంటుంది. అలానే జామకాయ, బొప్పాయి, టమోటా, బ్రోకలీ లో సమృద్ధిగా ఉంటుంది.
విటమిన్ డి :
సూర్య కిరణాల ద్వారా విటమిన్ డి మందికి అందుతుంది. అలానే డైరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకోవడం మంచిది. విటమిన్-డి ఎముకల్ని దృఢంగా చేస్తుంది.